తెలుగులో ఓ సినిమా వస్తే చాలు... వెంటనే ఎగరేసుకుపోవడానికి రెడీ అయిపోతోంది బాలీవుడ్. చిన్న సినిమాలపై వాళ్లు మరింతగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి `పుష్షక విమానం` పై పడింది. గత వారం విడుదలైన సినిమాల్లో `పుష్పక విమానం` ఒకటి. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాత. ఈ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నార్ట. మూడు అగ్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమా రీమేక్ రైట్స్కోసం ప్రయత్నిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.
అయితే ఈ సినిమాని స్వయంగా విజయ్ దేవరకొండనే హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్టు టాక్. ఎందుకంటే... ఈసినిమాని అతి తక్కువ బడ్జెట్లో తీయొచ్చు. మంచి స్టార్ కాస్టింగ్ చూసుకుంటే, టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంది. అందుకే విజయ్ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడని సమాచారం.కాకపోతే.. ఓ బాలీవుడ్ సంస్థతో పార్టనర్ షిప్ తో ఈ సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.