సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ చాలా కాలం తరువాత ఒక తెలుగు చిత్రంలో నటించాడు. ఇక గృహం అనే ఈ చిత్రంతో హారర్-థ్రిల్లర్ జనార్ లోకి అడుగుపెడుతున్నాడు.
అయితే రేపు విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే వారానికి వాయిదా పడింది. రేపు ఈ చిత్రం కాకుండా మరో రెండు చిత్రాలు (గరుడవేగ & నెక్స్ట్ నువ్వే) విడుదల అవుతున్న నేపధ్యంలో గృహం చిత్రం విడుదలని వాయిదా వేశారు.
ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన ఆండ్రియా నటిస్తుండగా ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల అవుతున్నది. మిలింద్ అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయం అవుతున్నాడు.
మొత్తానికి చాలా గ్యాప్ తరువాత హిట్ కోడదామనుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ఒక వారం ఆగాల్సిందే.