జంబల్‌ హాట్‌ సెల్ఫీ బ్యూటీ

By iQlikMovies - October 02, 2018 - 12:49 PM IST

మరిన్ని వార్తలు

'జంబలకిడి పంబ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సిద్దీ ఇద్నానీ. తొలి చూపులోనే అమ్మడు సూపర్బ్‌ అనిపించేసుకుంది ఈ సినిమాతో. అయితే నెక్స్ట్‌ ఏంటీ? అంటే క్వశ్చన్‌ మార్కే. తర్వాత మరో ఆఫర్‌ అందుకోలేకపోయింది. అయినా అదేమీ పట్టించుకోకుండా చక్కగా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. కెరీర్‌లో ఎప్పుడు ఎలా టర్న్‌ అవుతుందనేది మన చేతుల్లో ఉండదనీ నీతులు వల్లె వేస్తోంది. మంచి ఆఫర్‌ ఒక్కటి పడితే చాలు దశ తిరిగిపోతుంది అనే కాన్ఫిడెన్స్‌తో ఉందట. తనకు తోచిన రీతిలో ట్రైల్స్‌ వేస్తూనే ఉందట. ఆ ట్రైల్స్‌లో భాగంగానే సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ దర్శక, నిర్మాతల్ని ఎట్రాక్ట్‌ చేయడంతో పాటు, ఫాలోవర్స్‌ని కూడా పెంచుకునే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఈ హాట్‌ బ్యూటీ ఇదిగో ఇలా హాట్‌ హాట్‌ సెల్ఫీలు దిగుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ టూ పీస్‌ బికినీలాంటి కాస్ట్యూమ్‌లో సిద్దీ అందాలు కిర్రాకు పుట్టిస్తున్నాయి. ఒక్క దెబ్బకే రెండు పిట్టలు అన్నట్లుగా అమ్మడి ఆలోచన భలేగుంది కదా. మరేమనుకున్నారు. దటీజ్‌ సిద్దీ ఇద్నానీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS