కొరటాలతో విజయ్‌ దేవరకొండ మరో సెన్సేషన్‌.?

మరిన్ని వార్తలు

కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సామాజిక అంశాన్ని జోడించి మంచి విజయాలు అందుకున్న డైరెక్టర్‌ కొరటాల శివ. సినిమా సినిమాకీ వేరియేషన్స్‌ చూపిస్తూ, యూత్‌ ఐకాన్‌గా సత్తా చాటుతూ, బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ జోరు పెంచుకుంటూ పోతున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుందట. 

విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే ఓ సరికొత్త కథా, కథనాలతో స్క్రిప్ట్‌ ప్రిపేర్‌ చేసే పనిలో ఉన్నాడట కొరటాలశివ. ఈ కాంబినేషన్‌ మూవీ అంటే ఖచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని అంటేస్తాయనే చెప్పాలి. త్వరలోనే ఆ వివరాలు ప్రకటించనున్నారట. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'నోటా' చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. పబ్లిక్‌ మీటింగ్స్‌ పేరుతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. రాజకీయ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. 

వాటన్నింట్లోకీ విభిన్నంగా రూపొందుతోన్న పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ 'నోటా'. 'అర్జున్‌రెడ్డి', గీత గోవిందం' చిత్రాల సక్సెస్‌తో పెరిగిన విజయ్‌దేవరకొండ మార్కెట్‌ని బట్టి ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జ్ఞాన్‌వేల్‌ రాజా నిర్మిస్తున్నారు. అందాల భామ మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నాజర్‌, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

అక్టోబర్‌ 5న 'నోటా' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS