గ్లామ్‌షాట్‌: రెడ్‌ హాట్‌ 'జంబలకిడి' లడికీ'!

మరిన్ని వార్తలు

'జంబలకిడి పంబ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సిద్దీ ఇద్నానీ. తొలి సినిమాకే టాలెంట్‌ చూపించింది. పర్‌ఫామెన్స్‌కి స్కోపున్న పాత్ర కావడంతో తనలోని టాలెంట్‌ని మొదటి సినిమాకే తవ్వి తీసే అవకాశం దక్కింది. అయితే, ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైంది. 'జంబలకిడి పంబ' తర్వాత అమ్మడు నటించిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్‌ 2'. అయితే, ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయిన కారణంగా ఈ ముద్దుగుమ్మని అందరూ మర్చిపోయారు. తాజాగా సోషల్‌ మీడియాలో సిద్దీ పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. దాంతో అమ్మడి పేరు మళ్లీ టాక్‌లో నిలిచింది.

 

తప్పదు, అందాల భామలు టాక్‌లో నిలవాలంటే, ఇలాంటివే ఏవో ఒకటి చేస్తుండాలి. లేటెస్ట్‌ పిక్‌ విషయానికి వస్తే, రెడ్‌ హాట్‌ ఫ్రాక్‌లో సిద్దీ చాలా బ్రైట్‌ లుక్స్‌తో కేక పుట్టిస్తోంది. ఓహో.! జంబలకిడి లడకీ.. నీలో ఇంత గ్లామర్‌ దాగుందా.? అని నెటిజన్లు ఆశ్చర్యపోయేంతలా ఈ పిక్‌లో సిద్దీ కవ్విస్తోంది మరి. ఈ కవ్వింపు చూసి అయినా, సిద్దీకి తదుపరి అవకాశాలేమైనా దక్కుతాయేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS