గ్లామ్‌షాట్‌: క్లీవేజ్‌ సెల్ఫీ కిల్లింగ్‌ లుక్స్‌!

మరిన్ని వార్తలు

'జంబలకిడి పంబ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సిద్దీ ఇద్నానీ. తొలి సినిమాకే పాపలో విషయముంది అనిపించుకుంది. కానీ, అంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. రెండో సినిమాగా 'ప్రేమ కథా చిత్రమ్‌ 2' లో నటించింది. ఈ సినిమాతో సరైన హిట్‌ దక్కి ఉంటే, పాప దశ మారేది. కానీ, ఫర్వాలేదనిపించుకుని రేస్‌ నుండి తప్పుకుంది ఈ సినిమా. దాంతో పాపని ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఈ మధ్యనే సీనియర్‌ హీరో రాజశేఖర్‌ చెప్పారుగా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఉండాల్సింది టాలెంట్‌ కాదు, సక్సెస్‌ అని. అలా ఈ ముద్దుగుమ్మలకి టాలెంట్‌ ఉన్నా, సక్సెస్‌ లేకపోవడంతో కలిసి రావడం లేదు. సక్సెస్‌కి, టాలెంట్‌ తోడైతే పాప ఈ పాటికి ఎక్కడికో వెళ్లిపోయేదన్నమాటే.

అయితే, అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలైతే చేయాలి కదా.. అదే చేస్తోంది ప్రస్తుతం ఈ భామ. టాలెంట్‌తో పాటు, గ్లామర్‌ పాళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి అమ్మడిలో. అందుకే వాటిని ఎరగా వేసి, అవకాశాలు దక్కించుకోవాలనుకుంటోంది.

అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో హాట్‌ పోజులిస్తూ, తళుక్కున మెరుస్తూంటుంది. అలా ఇచ్చిన ఓ పోజులో సిద్దీ ఇద్నానీని చూశారా.? బ్లాక్‌ కాస్ట్యూమ్‌లో సెల్ఫీ పోజులా కనిపిస్తోన్న ఈ పోజులో ఆమె పెదాల్లో మదన రసం కైపెక్కిస్తోంది. డ్రస్సుపై అక్కడక్కడా పొదిగిన చెమ్కీలు ఆమె ముఖంపై రిఫ్లెక్ట్‌ అవుతూ మరింత బ్రైట్‌నెస్‌ అద్దుతున్నట్లుంది.

ఇక మెడలో ధరించిన బ్లాక్‌ కలర్‌ కంఠాభరణం ఆమె గ్లామర్‌కి పెద్ద పీట వేసినట్లుంది. బొద్దుగా దిద్దిన ఐబ్రోస్‌ హావభావాల్ని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా కనీ కనిపించనట్లున్న ఆ క్లీవేజ్‌ షో ఆమెలోని గ్లామర్‌ యాంగిల్‌ని జస్ట్‌ సింపుల్‌గా చూపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS