గ్లామ్‌షాట్‌: 'బ్రా'బోయ్‌ బ్లాక్‌ హాట్‌ శృంగార దేవత!

మరిన్ని వార్తలు

'జంబలకిడి పంబ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ సిద్దీ ఇద్నానీకి యాక్టింగ్‌ స్కిల్సే బాగానే ఉన్నాయని తొలి సినిమాతోనే ప్రూవ్‌ చేసుకుంది. సినిమా కూడా హిట్‌ అయ్యింది. కానీ, రెండో సినిమా ఛాన్స్‌ దక్కించుకోవడానికే చాలా కష్టపడింది. ఎట్టకేలకు 'ప్రేమకథా చిత్రమ్‌ 2'లో ఛాన్స్‌ దక్కించుకుంది. కానీ, పాపం ఈ సినిమా నిరాశపరిచింది. అసలు సిసలు ఛాన్స్‌ కోసం సాహసాలు చేస్తోంది.

 

అదేనండీ సోషల్‌మీడియాలో గ్లామర్‌ సాహసాలు. ఆ సాహసాల్లో భాగంగా ఓ హాట్‌ పిక్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. యాష్‌ కలర్‌లో ఓ డిఫరెంట్‌ కాస్ట్యూమ్‌ ధరించి, మేఘాల్లో తేలిపోతున్నట్లుగా కెమెరాకి ఓ విచిత్రమైన పోజిచ్చింది. కాస్ట్యూమ్‌ విషయానికొస్తే, మేఘాల రంగు గౌను, స్లీవ్‌లెస్‌ ప్యాటర్న్‌, ఓ వైపు షోల్డర్‌ స్ట్రిప్‌ని జారవిడిచి, లోపల ఉన్న బ్లాక్‌ హాట్‌ బ్రాని చూపిస్తోంది. ఈ షో ఆమె ఎద సౌందర్యాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది.

 

ఇక ఆ గౌనుపై ధరించిన బ్లాక్‌ కలర్‌ ఉలెన్‌ జాకెట్‌ ఇస్తున్న ఎఫెక్ట్‌ దివి నుండి భువికి దిగుతున్న శృంగార దేవతలా సిద్దీని చూపిస్తోంది. మెడకు బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్ట్రిప్‌లాంటి ఓ యాక్సెసరీ కాస్ట్యూమ్‌ వెయిట్‌ని పెంచేస్తోంది. చెవులకు పెద్ద పెద్ద రింగులు, గాలికి ఎగురుతున్న ముంగురులు, డ్రస్‌కి మ్యాచింగ్‌ నెయిల్‌ పాలిష్‌ ఇలా ప్రతీ అంశం, ఈ పిక్‌లో రిచ్‌నెస్‌ని వెయ్యి వంతులు చేసేస్తోంది. ఫోటో సెషన్‌ కోసం సిద్దీ చేసిన ఈ హంగామా నెటిజన్స్‌కి తెగ నచ్చేసింది. అందుకే లైకులు, కామెంట్లూ, షేర్లతో సోషల్‌ హోరెత్తించేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS