వెంకీ సినిమాలో టిల్లు

మరిన్ని వార్తలు

అనిల్ రావి పూడి అంటే తెలియని వారు లేరు. తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ డైరక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న డైరక్టర్ అనిల్ రావి పూడి. రాజా ది గ్రేట్, పటాస్,  F2 , F3 సినిమాలతో మంచి గుర్తింపుతో పాటు వసూళ్లు  కూడా  రాబట్టాడు. మహేష్ బాబుతో 'సరి లేరు నీకెవరు' మూవీలో కామెడీతో పాటు కమర్షియల్ అంశాలతో  సినిమా తీసి, సక్సెస్ సాధించాడు. అదే జోరుతో నందమూరి నటసింహం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి లాంటి యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో కూడా మెప్పించి, బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. నెక్స్ట్ అనిల్ రావిపూడి వెంకటేష్ తో ఒక సినిమా చేయనున్నాడు. 


ఎప్పుడూ కామెడీ జోనర్లోనే సినిమాలు చేసే అనిల్ మొదటిసారిగా భగవంత్ కేసరి కోసం రూటు మార్చాడు. ఇప్పుడు వెంకీతో కూడా డిఫరెంట్ జోనర్ సినిమా చేయనున్నట్లు టాక్. ఇప్పటి వరకు మీరు చూసింది వేరు, ఇకపై మీరు చూసేది వేరు కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాను అంటూ అనిల్ హింట్ ఇస్తున్నాడు.  F2 , F3 లలో అనిల్ కామెడీ టైమింగ్ కి వెంకీ పర్ఫెక్ట్ అనిపించాడు. అందుకే మళ్ళీ వెంకీ వైపే అనిల్ మొగ్గు చూపాడు. కామెడీకి కాస్త సీరియస్ టచ్ ఇస్తూ, క్రైమ్ కామెడీగా ఈ  సినిమా రూపొందిస్తున్నారు. 'కెప్టెన్' అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 


అనిల్, వెంకీ కాంబినేషన్ అంటేనే ఫాన్స్ కి కడుపుబ్బా నవ్వించే కామెడీ గుర్తుకు వస్తుంది. అలాంటిది ఈ కాంబోకి సిద్దు జొన్నలగడ్డ చేరితే ఇంకేమైనా ఉందా. అవును ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం టిల్లు గాడ్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి క్రేజ్ మీద ఉన్న సిద్దు , కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావి పూడి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. ఫుల్ లెన్త్ రోల్ కాకపోయినా, 15 నిమిషాల పాటు సిద్దు ఈ  సినిమాలో కనిపిస్తాడని, సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS