సమంత విడాకుల వ్యవహారంలో కొన్ని ట్వీట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అందులో సిద్దార్థ్ చేసిన ట్వీట్ ఒకటి. చీటర్స్ సుఖంగా బతకలేరు అనే అర్థం వచ్చేలా సిద్దార్థ్ ఓ ట్వీట్ చేశాడు. అది సమంత గురించే అన్నది చాలామంది ఉద్దేశ్యం. సమంతకీ,సిద్దూకీ అప్పట్లో ఓ ఎఫైర్ నడిచింది. కానీ సమంత సిద్దూకి హ్యాండిచ్చి, చైతూని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ విడిపోయిన వెంటనే.. సిద్దార్థ్ ఈ ట్వీట్ చేయడంతో.. అది సమంత గురించే అని అంతా ఫిక్సయిపోయారు. దీనిపై సిద్దార్థ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు.
''మా ఇంటి బయట చాలా కుక్కలున్నాయని చెప్పాను. ఎవరో వచ్చి నన్ను కుక్క అంటావా అంటే నేనేం చేయాలి. నా లైఫ్ గురించి నేను మాట్లాడతాను. సంబంధం లేకుండా వేరే వ్యక్తులతో లింక్ చేసి అడిగితే అది నా సమస్య కాదు. నాకు, సమంత ఇష్యూకు సంబంధమే లేదు. నేను నా టీచర్ దగ్గర నేర్చుకున్న విషయాన్ని చెప్పాను. మహాసముద్రంలో కూడా ఈ టాపిక్ ఉంది. మోసం చేయడం గురించి డైరక్టర్ అజయ్ భూపతితో నేను ఈ విషయంపై మాట్లాడాను. మోసం చేస్తే లైఫ్ లో ఎప్పుడూ బాగుపడరనే సందేశం మహాసముద్రంలో కూడా ఉంది. ఆ డిస్కషన్ లో నాకు బాగా నచ్చి ఆ కొటేషన్ ను వెంటనే ట్వీట్ చేశా. ఆమాత్రం దానికే ప్రపంచంలోని మోసగాళ్లంతా వచ్చి నన్ను ప్రశ్నిస్తే నేనేం చేయగలను'' అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు సిద్దూ. తను నటించిన `మహా సముద్రం` ఈనెల 14న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.