నాగచైతన్య - సమంతలు విడిపోవడం ఇండ్రస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందరి నోటా ఇదే మాట. అయితే కొంతమంది స్టార్స్ సైతం నర్మ గర్భంగా ట్వీట్లు చేస్తున్నారు. అందులో ప్రముఖంగా సిద్దార్థ్ పేరు వినిపిస్తోంది. తమ విడాకుల గురించి చైతన్య ట్వీట్ చేసిన కాసేపటికే.. సిద్దార్థ్ ఓ ట్వీట్ పెట్టాడు. ‘‘ ఛీటర్స్ ఎప్పుడు బాగుపడరు ’’ అంటూ ఇంగ్లీష్ లో సిద్దూ చేసి ట్వీట్ ఇప్పుడు మరింత కాక పుట్టిస్తోంది. చై - సమంత విడాకుల నేపథ్యంలోనే, సిద్దార్థ్ ఈ ట్వీట్ చేశాడన్నది నెటిజన్ల మాట.
ఇది వరకు చైతన్యతో పెళ్లి కి ముందు సిద్దార్థ్‌తో కొంతకాలం ప్రేమాయణం నడిపింది సమంత. సిద్దార్థ్ తో సమంత విడిపోవడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తనకు బై చెప్పి, మరొకరితో పెళ్లి చేసుకోవడం సిద్దార్థ్ జీర్ణించుకోలేకపోయాడని, ఇప్పుడు ఇద్దరూ విడిపోవడంతో.. సిద్దార్థ్ ఈ ట్వీట్ పెట్టాడన్నది అందరి అనుమానం. సిద్దూ ట్వీట్ కి మిశ్రమ స్పందన లభిస్తోంది. `వాళ్లిద్దరూ విడిపోతే.. నీకు అంత ఆనందం ఏమిటి?` అంటూ చాలామంది సిద్దార్థ్ నే నేరుగా ప్రశ్నిస్తున్నారు. అసలు మేటరేంటో చెప్పకుండా నర్మగర్భంగా ఇలాంటి ట్వీట్లు చేయడమేంటి? ధైర్యముంటే... ఉన్నది ఉన్నట్టు చెప్పు - అనేవాళ్లూ ఉన్నారు. మొత్తానికి సిద్దార్థ్ ట్వీట్ మాత్రం బాగా వైరల్ అయ్యింది.