బోయ కులానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి ఋషిగా మారి రామాయణం రచించారు. ఓ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ మనిషిగా మారి ఏం చేశాడన్నదే 'వాల్మీకి' సినిమా కథ. చరిత్రలో ఋషి వాల్మీకి అయితే, మన సినిమాలో వాల్మీకి గద్దలకొండ గణేష్. ఈ శుక్రవారం 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా, తాజాగా 'వాల్మీకి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన వెంకటేష్ 'నా కో బ్రదర్'కి గబ్బర్‌సింగ్ లాంటి హిట్ కట్టబెట్టాలి..' అని కోరుకున్నాడు.
ఈ ఇద్దరూ కలిసి 'ఎఫ్ 2'లో కో బ్రదర్స్‌లా నటించిన సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకుడు. గబ్బర్‌సింగ్ తర్వాత హరీష్ శంకర్ ఆ స్థాయి హిట్‌ని మళ్లీ 'వాల్మీకి'తోనే అందుకుంటాడని ఆశిస్తున్నారు. హీరో వరుణ్ తేజ్ క్యారెక్టర్ డిజైన్‌ని ఆ రేంజ్‌లో డిజైన్ చేశాడు మరి. 'గద్దల కొండ గణేష్' అంటే 'గబ్బర్ సింగ్' అనే సౌండింగే చెవులకు వినిపిస్తోంది. క్యారెక్టర్ ఆటిట్యూడ్ కూడా ఆ పాత్రనే తలపిస్తోంది.
తెలంగాణా యాసలో వరుణ్ తేజ్ డైలాగ్ డెలివరీని కూడా గబ్బర్ సింగ్ పాత్రకే ఆపాదించుకుంటున్నారు అభిమానులు. కామన్‌గా ఉన్న మరో పాయింట్ ఏంటంటే, రెండూ రీమేక్ మూవీసే. సో మెగా ఫ్యాన్స్ 'వాల్మీకి'ని అలా ఫిక్సయిపోయారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మృణాళిని మరో హీరోయిన్‌గా నటించింది. అధర్వ కీలక పాత్ర పోషించాడు.