గాన కోకిలగా పేరుపొందిన ప్రముఖ గాయని జానకి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయమేమిటంటే- ఇక పై నుండు ఎటువంటి పాటలు పాడటం అదే పాటల కచేరిలు ఇవ్వకూడదు అన్న నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆమె వేదికలపై పాడటానికి, కచ్చేరిలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక నిన్న మైసూర్ లో జరిగిన ఒక సంగీత విభావరిలో ఆమె ఆఖరి సారిగా తన మాధుర్యమైన స్వరంతో ప్రేక్షకులని ఆనందింపచేశారు.
ఇక తన సంగీత ప్రస్థానానికి జన్మస్థలం అయిన మైసూర్ లోనే తన ఆఖరి ప్రదర్శన అవ్వడం తనకి ఎంతో తృప్తిని ఇస్తున్నది అని ఆమె తన మనసులోని భావాలని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెకి పలువురు పురప్రముఖులు ఈ విభావారికి విచ్చేసి ఆమెని ఘనంగా సత్కరించారు.