ప్రముఖ గాయని రాధిక (47) ఇక లేరు.
వివరాల్లోకి వెళితే, చెన్నైలోని ఆమె స్వగృహంలో నిన్న ఉదయం గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె తన భర్త ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో భాధపడుతున్నట్టు సమాచారం.
ఇక రాధిక సినీ కెరీర్ విషయానికి వస్తే, బావలు సయ్యా.. హే మరదలు సయ్యా.. పాటతో ఆమె ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆమె కెరీర్ మొత్తంలో 200 పాటలకు పైగా పాడారు. రాధిక అకాల మృతికి సంగీత దర్శకులు తీవ్ర దిగ్బ్రాంతి తెలియచేశారు.
ఈ విషాద సమయంలో www.iQlikmovies.com తరపున రాధిక కుటుంబసభ్యులకు సంతాపం తెలియచేస్తున్నాము.