ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో ఆమె కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబరు 30న జన్మించారు. చిన్నప్పుడే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. అయితే ఆమెకు సినిమా పాటలపై ఎక్కువ ఆసక్తి వుండేది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా పలు భాషల్లో దాదాపు 20వేలకు పైగా పాటలు ఆలపించారు. ఇటీవలే వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ ప్రకటించింది.