ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ ల 'అన్న' బంధం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? కల్యాణ్ రామ్ సినిమా అంటే ఎన్టీఆర్‌దే. ఎన్టీఆర్ సినిమా అంటే కల్యాణ్ రామ్‌దే. కల్యాణ్ రామ్ సినిమాల వెనుక ఎన్టీఆర్ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడూ అంతే. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన అమిగోస్ ఈనెల 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోఝన్లు ఇప్పుడు జోరుగా మొదలయ్యాయి. ఆదివారం హైదరాబాద్‌లో అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ ఈవెంట్ తో అమిగోస్ ప్రమోషన్లు హై రేంజ్‌కి వెళ్లిపోవడం ఖాయం.
నిజానికి.. అమిగోస్ ప్రీ రిలీజ్ చేయాలా? వద్దా? అనే మిమాంశలో ఉంది... చిత్రబృందం. ఎందుకంటే తారకరత్న ఆరోగ్యం బాగాలేదు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి దశలో సినిమా వేడుకలు చేయడం భావ్యం కాదు. కాకపోతే.. తారకరత్న ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడుతోంది. ఆయన డేంజర్ జోన్ నుంచి బయటపడినట్టే అని డాక్టర్లు చెప్పారు. దాంతో.. ఈ ఈవెంట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిందే.