'సర్కార్‌-3' కోసం సిరాశ్రీ హిందీ పాట

మరిన్ని వార్తలు

అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో 'సర్కార్‌-3' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది కూడా. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన 'సర్కార్‌-3'పై భారీ అంచనాలున్నాయి. సినిమా ప్రమోషన్స్‌ ఆ అంచనాల్ని మరింతగా పెంచేస్తున్నాయి. బాలీవుడ్‌లో 'సర్కార్‌' సినిమా ఓ సంచలనం. ఆ 'సర్కార్‌'కి ఇప్పుడు కొత్త సీక్వెల్‌ 'సర్కార్‌-3' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సర్కార్‌, సర్కార్‌-2 మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇంకో వైపున 'సర్కార్‌-3'సినిమా కోసం ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సిరాశ్రీ ఓ పాటను రాశారు. ఆ విషయాన్ని స్వయంగా రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు. వర్మ గతంలో తెరకెక్కించిన పలు తెలుగు సినిమాలకు సిరాశ్రీ మంచి మంచి పాటల్ని అందించిన సంగతి తెలిసినదే. వాటిల్లో కొన్ని పాటలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. రామ్‌ గోపాల్‌ వర్మకి అత్యంత సన్నిహితుడు సిరాశ్రీ. ఈ విలక్షణ రచయిత ఇంతవరకూ పలు తెలుగు చిత్రాలకు పాటల్ని రచించారు. మామూలుగా ఓ భాషకి చెందిన సినీ గేయ రచయితలు మరో భాషలో పాటలు రాయడం చాలా అరుదు. బాలీవుడ్‌కి సంబంధించినంత వరకూ సౌత్‌ సినిమా నుండి ఎవరూ హిందీ పాటలు రాసిన దాఖలాలు లేవు. ఆ రకంగా చూస్తే, బాలీవుడ్‌ సినిమాకి హిందీ పాట రాసిన తొలి తెలుగు సినీ గేయ రచయిత సిరాశ్రీగా రికార్డులకెక్కుతారేమో. త్వరలో 'సర్కార్‌-3' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS