హై కోర్టుని ఆశ్రయించిన కమల్ హాసన్

మరిన్ని వార్తలు

లోకనాయకుడు కమల్ హాసన్ కి కోర్టు కేసులు కొత్తేం కాదు. ఆయన పై లేక ఆయన సినిమాల పైన ఇప్పటికి  చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే దీనికి కారణం, కమల్ హాసన్ ముక్కుసూటితనమే అని చాలా మంది చెబుతారు.

ఇక పోయిన నెలలో మహాభారతం పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని తమిళనాడులోని తిరునెల్వేలి కోర్టులో కేసు నమోదు అయింది. రేపు కమల్ ఆ కేసు విషయమై కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయన పై పెట్టిన కేసు నిరాధారమైనదని పేర్కొంటూ ఈ కేసుని కొట్టివేయాలి అని మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశాడు.

కమల్ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ అంశం కొత్త మలుపు తిరిగింది. కమల్ వేసిన పిటీషన్ పై  హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS