అల్లు శిరీష్ చాలా కాలం తరవాత ఓ సినిమా చేశాడు. అదే 'ఊర్వశివో.. రాక్షసివో'. అనూ ఇమ్మానియేల్ కథానాయిక. విజేత ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహించాడు.
మామూలుగా అయితే ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ ఉండదు. ఎందుకంటే అల్లు శిరీష్ ఎప్పుడో గానీ సినిమా చేయడం లేదు. చేసినా.. ఫ్లాపులే. రాకేష్ శశి చేసిన విజేత ఫ్లాపయ్యింది. అను ఇమ్మానియేల్ హీరోయిన్ల రేసు నుంచి పక్కకు వెళ్లిపోయి చాలా కాలమైంది. అందుకే ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కాకపోతే.. ఓ టీజర్ తో అటెన్షన్ పెంచేశారు. ఊర్వశివో - రాక్షసివో టీజర్ ఈరోజు విడుదలైంది. టీజర్ హాట్ హాట్ గా ఉంది. శిరీష్ - అను ఇమ్మానియేల్ మధ్య హాట్ లిప్ లాక్ సీన్లు రెండు ఉన్నాయి. టీజరే ఇలా ఉంటే, ట్రైలర్లో ఇంకెన్ని ఉంటాయో, సినిమాలో ఇంకేం ఉంటాయో..? అన్నంత ఉత్సుకత పెంచేశారు. 'ఇంట్లో బుద్దిమాన్ - బయట శక్తిమాన్' ఇదీ.. పోసాని కృష్ణ మురళి మాటల్లో అల్లు శిరీష్ క్యారెక్టరు.
ఇంట్లో బుద్దిగా నటిస్తూ.. బయట చాలా వ్యవహారాలు వెలగబెడుతుంటాడు. అను ఇమ్మానియేల్ పాత్ర కూడా క్రేజీగానే డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే టీజర్ తో ఈ సినిమాపై ఫోకస్ పడేలా చేసుకొంది చిత్ర బృందం. సినిమాలో మేటర్ ఉంటే... శిరీష్ కి హిట్టు పడినట్టే. అన్నట్టు ఇది వరకు ఈ సినిమాకి 'ఇది ప్రేమ కాదంట' అనే పేరు పెట్టారు. ఇప్పుడు `ఊర్వశివో.. రాక్షసివో` అనే టైటిల్ మార్చారు.