సీతారామ‌శాస్త్రి ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంది?

మరిన్ని వార్తలు

దిగ్గజ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు’ అని కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

 

సీతారామశాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అయితే పాటలు రాయడం మాత్రం తగ్గించలేదు. ఈ మధ్య విడుదలైన 'కొండపొలం' సినిమా కోసం దర్శకుడు క్రిష్.. పట్టుపట్టి మరీ సిరివెన్నలతో రెండు పాటలు రాయించుకున్నారు. సెట్స్ పై వున్న పవన్ కళ్యాణ్ 'హరిహర వీర మల్లు 'పాటల భారం సిరివెన్నలపైనే పెట్టారు క్రిష్. ఆయన త్వరగా కోలుకొని రావాలని సినీ పరిశ్రమ, అభిమానులు కోరుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS