గత నెల నెలన్నర క్రితం ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కనపడిన ఏకైక న్యూస్- డ్రగ్స్ మాఫియా. ఈ డ్రగ్స్ మాఫియా లో టాలీవుడ్ కి చెందిన ప్రముఖుల పాత్ర ఉందంటూ SIT వారు పలువురికి నోటిసులు ఇవ్వడం, వారు సైతం విచారణకి హాజరుకావడం జరిగాయి.
అయితే మొన్నీమధ్యనే బడా హీరోయిన్ ఒకరు ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు, ఆమె డ్రగ్స్ సేవిస్తుండగా తీసిన ఒక వీడియో SIT వద్ద ఉన్నట్టు సమాచారం. ఇదే కాకుండా, సదరు హీరోయిన్ కి చెందిన మరికొన్ని వీడియోలు (డ్రగ్స్ సేవిస్తుండగా) కూడా వారి వద్ద ఉన్నట్టు, దానిని ఆధారం చేసుకొని ఆమెకి నోటిసులు పంపనున్నారట.
అయితే ఆమె ఎవరు అన్న విషయం కూడా గోప్యంగా ఉంచుతున్నట్టు SIT వర్గాల సమాచారం. ఇక త్వరలోనే ఆ నటికి నోటిసులు పంపి విచారణ జరిపే ప్రక్రియని ఎక్ష్సైజ్ శాక వారు మొదలుపెట్టినట్టు వినికిడి.