మహేష్ అభిమానులకి ఇది ఒకరకంగా చేదు వార్తనే చెప్పాలి.
వివరాల్లోకి వెళ్ళితే, మహేష్ స్పైడర్ చిత్రంతో తమిళంలోకి మొదటిసారిగా ప్రవేశిస్తున్న సంగతి విదితమే. అయితే దాన్ని పురస్కరించుకొని చెన్నైలో ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ సెప్టెంబర్ 9న నిర్వహించనున్నారు. అయితే ఇక్కడే తెలుగు ఆడియో విడుదల కూడా నిర్వహించేస్తుండడం గమనార్హం.
దీన్నిబట్టి ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో స్పైడర్ తెలుగు వెర్షన్ ఆడియో విడుదల జరిగే ఆస్కారం లేనట్టే. ఇది ఒకరకంగా ఇక్కడి ఫ్యాన్స్ కి ఇబ్బందికరమే. అయితే ఇంకేదైనా ఈవెంట్ ని విడుదల కి ముందు ప్లాన్ చేస్తారా లేదా అన్నది ఇంతవరకు తెలియదు.
ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా దర్శకులు- శంకర్ & రాజమౌళి విచ్చేయనున్నారు. మొత్తానికి తమిళంలోమార్కెట్ పెంచుకునే యోచనలో తెలుగుని లైట్ తీసుకునట్టుగా అర్ధమవుతున్నది.