వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించాడు. మృణాల్ ఠాకూర్ నాయిక. రష్మిక ఓ కీలక పాత్ర చేసింది. ఈసినిమా శుక్రవారం విడుదలైంది.
రివ్యూలు చాలా పాజిటీవ్‌గా వచ్చాయి. కానీ వసూళ్లు మాత్రం కాస్త స్లోగా ఉన్నాయి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిసి దాదాపుగా రూ.2 కోట్లు సాధించినట్టు టాక్. ఈ సినిమాపై దాదాపుగా రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టారు. అన్ని ఏరియాల్లోనూ సొంతంగానే విడుదల చేసుకొన్నారు. మౌత్ టాక్‌ని బట్టి ఈసినిమాని వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. శని, ఆదివారాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. అది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. మరోవైపు సీతారామంతో పోలిస్తే బింబిసారకు ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. అది మాస్ సినిమా కాబట్టి, రెంటికీ ఈ స్థాయిలో వ్యత్యాసం ఉండడం సాధారణమే.
లాంగ్ రన్ లో సీతారామం నిలబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీసు పరంగా రిపోర్ట్ ఎలా ఉన్నా, సీతారామం టేబుల్ ప్రాఫిట్ సినిమా అనీ, దీనికి.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ బాగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పైగా మలయాళంలో దుల్కర్‌కి మంచి క్రేజ్ ఉంది. అక్కడ ఈ చిత్రానికి వసూళ్లు బాగుంటాయి. కాబట్టి.. సీతారామం ఇప్పటికీ సేఫ్ జోన్ లో ఉన్నట్టే.