బింబిసార సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడే.. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని ప్రకటించాడు కల్యాణ్ రామ్. అయితే.. జనాలు అందరిలోనూ ఓ డౌట్ ఏర్పడింది. ముందు ఇలానే చెబుతారు, సినిమా అటూ ఇటూ అయితే, దాన్ని పట్టించుకోరు - అనే కామెంట్లు చేశారు. బింబిసారకు నెగిటీవ్ టాక్ వస్తే అదే జరిగేదేమో..?
కానీ శుక్రవారం విడుదలైన బింబిసార ఓకే అనిపించుకొంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో ఈ సినిమాకి స్పందన బాగుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే - ఈమధ్య కాలంలో కల్యాణ్ రామ్ సినిమా దేనికీ రాని ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయి. దాంతో.. కల్యాణ్ రామ్ మొహంలో కొత్త ఆనందం కనిపిస్తోంది. బింబిసార పార్ట్ 2 ఇంకా భారీగా, ఇంకా బాధ్యతతతో తీస్తామని ఉత్సాహంగా ప్రకటించేశాడు.
బింబిసార 2కి కావల్సిన లైను.. పార్ట్ 1 చివర్లో కనిపిస్తుంది. బింబిసార చనిపోయినా... `బింబిసారుడ్నిచంపే మొనగాడు ఇంకా పుట్టలేదు` అనే డైలాగ్ తో సినిమా ముగించారు. అంటే బింబిసారుడు చనిపోడన్న సంగతి అర్థమవుతూనే ఉంది. మరోవైపు సంజీవని పుష్పం గురించి కూడా ఓ హింటు ఇచ్చాడు దర్శకుడు. దాంతో బింబిసారుడ్ని మళ్లీ బతికించొచ్చన్నమాట. అలా... పార్ట్ 2కి ఫ్లాట్ ఫామ్ బాగానే వేసుకొన్నాడు. సో... త్వరలోనే పార్ట్ 2 సెట్స్‌పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.