Sita Ramam: ప్రీరిలీజ్ రివ్యూ .. 'సీతారామం'

By Gowthami - August 04, 2022 - 11:25 AM IST

మరిన్ని వార్తలు

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం' ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.

 

తాజాగా 'సీతారామం' ఫస్ట్ రివ్యూ టాక్ బయటికి వచ్చిం. అన్నపూర్ణ స్టూడియోస్ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ సివి రావ్ ఈ సినిమా షార్ట్ రివ్యూ ఇచ్చారు. '' సినిమా బావుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గుడ్. నిర్మాణ విలువలు, సాంకేతిక నిపుణులు అత్యున్నత అవుట్ పుట్ ఇచ్చారు. ఈమధ్య కాలం వచ్చిన ఉత్తమ చిత్రం సీతారామం. ప్రతి ఒక్కరూ థియేటర్ లో ఎక్స్ పిరియన్స్ చేయాల్సిన చిత్రం సీతారామం'' అని చెప్పుకొచ్చారు. మరికొన్ని గంటలోఈ సినిమా ప్రేక్షకుల మందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS