వైజయంతి మూవీస్ అంటేనే భారీదనం. ప్రస్తుతం వైజయంతి నిర్మాణంలో సీతారామం అనే ఓ ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలై పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం మరో హైలెట్ స్టార్ కాస్ట్. దాదాపు అందరూ పేరున్న నటీనటులే ఈ చిత్రంలో భాగమయ్యారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ జోడి. రష్మిక మందన చాలా కీలక పాత్ర. విష్ణు శర్మ అనే పాత్ర కోసం హీరో సుమంత్ ని తీసుకున్నారు.
అలాగే ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ ని బాలాజీ అనే పాత్ర కోసం తీసుకున్నారు. తరుణ్ చాలా సెలెక్టివ్. ఆయన పాత్ర ఒప్పుకున్నాడంటే ప్రాముఖ్యత వుంటుంది. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ సెల్వన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటివలే ఆయన ఫస్ట్ లుక్ వదిలారు.
ఇప్పుడు మరో అప్డేట్.. ఈ చిత్రం భూమిక చావ్లా కూడా వుంది. మృణాళిని అనే పాత్రలో కనిపించబోతుంది. విష్ణు శర్మ పాత్ర పోహిస్తున్న సుమంత్ కి భార్యగా కనిపించబోతుంది. ఈ చిత్రంలో మరికొందరు పేరున్న నటీనటులు వున్నారు. త్వరలోనే అందరినీ పరిచయం చేస్తారు. ఆగస్ట్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.