గంగ తరవాత లారెన్స్ సినిమాలేవీ తెలుగునాట విడుదల కాలేదు. దాదాపు రెండేళ్ల విరామం తరవాత లారెన్స్ నుంచి వస్తున్న తెలుగు చిత్రం 'శివ గంగ'. పి.వాసు దర్శకత్వం వహించారు. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకటేష్ 'గురు'లో బాక్సింగ్ ఛాంపియన్గా నటించిన రితికా సింగ్ ఇందులో కథానాయిక పాత్ర పోషించింది. ఈ సినిమా విజయంపై లారెన్స్ చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రతీ సన్నివేశం థ్రిల్ కలిగిస్తుందని, మరీ ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోతుందంటున్నాడు లారెన్స్. అందులో రితికా సింగ్ నటన అద్భుతంగా ఉంటుందట. ''ఈ సినిమా చూసొచ్చాక ఇంట్రవెల్ బ్యాంగ్ గురించి కచ్చితంగా మాట్లాడుకొంటారు. చంద్రముఖిలో జ్యోతిక స్థాయిలో నటించింది రితికా సింగ్. ఈ సినిమాలో హీరో నేను కాదు.. రితికా సింగ్నే'' అంటూ ఆ క్రెడిట్ పూర్తిగా కథానాయికకే ఇచ్చేశాడు లారెన్స్. చూద్దాం.. రితిక ఏ స్థాయిలో విజృంభించిందో.