శివకార్తికేయన్ 'ప్రిన్స్' సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవర కొండ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ ని ఉద్దేశించి శివకార్తికేయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ స్వీట్ పర్శన్. ఆయన గీతగోవిందం నాకు చాలా ఇష్టం. నా ప్రయణం ఒక ట్రైన్ జర్నీలా సాగింది. కానీ విజయ్ ప్రయాణం ఒక రాకెట్ లా వుంది. ఇంత తక్కువ సమయంలో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. కుదిరితే విజయ్ తో కలసి నటించాలని వుంది'' అన్నారు శివకార్తికేయన్.
విజయ్ మాట్లాడుతూ..శివ కార్తికేయన్ ని ఎప్పుడూ కవలేదు కానీ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. శివకార్తికేయన్ గారి జర్నీ నాకు చాలా నచ్చింది. శివకార్తికేయన్ ఒక కార్యక్రమంలో ఏడుస్తుంటే అది చూసి ఆయనంటే ఒక బ్రదర్ ఫీలింగ్ వచ్చేసింది. అక్టోబర్ 21న ప్రిన్స్ థియేటర్లోకి వస్తుంది. నేను గ్యారెంటీగా చూస్తున్నా'' అని చెప్పుకొచ్చారు.