జాతి రత్నాలుతో అనుదీప్ పేరు మార్మోగిపోయింది. తనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, హీరోలూ ఎగబడ్డారు. ఆయన తన ద్వితీయ ప్రయత్నంగా చేసిన `ప్రిన్స్`పై చాలా ఆశలు పెంచుకొన్నారు. శివ కార్తికేయన్ హీరో అవ్వడం మరింత బలాన్ని ఇచ్చింది. `జాతిరత్నాలు`లానే... `ప్రిన్స్` కూడా సూపర్ హిట్టవుతుందనుకొన్నారు. కానీ.. `ప్రిన్స్` బాక్సాఫీసు దగ్గర చతికిల పడింది. బొటాబొటీ మార్కులు తెచ్చుకొంది. శివ కార్తికేయన్ కి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ కూడా ఈ సినిమా మెప్పించలేదు. కనీసం ఓటీటీలో అయినా ఈ సినిమా చూస్తారనుకొన్నారంతా.
ఇటీవలే.. `ప్రిన్స్` ఓటీటీలోకి వచ్చింది. అక్కడా.. ఈ సినిమాని పట్టించుకోవడం లేదు. ఓటీటీలో `ప్రిన్స్`కి వ్యూవర్ షిప్ పెద్దగా లేదన్నది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. చూసిన వాళ్లు కూడా `బోరింగ్ గా ఉంది..` అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లో వర్కవుట్ అవ్వకపోయినా... కనీసం ఓటీటీలో అయినా చూస్తారు. మరీ ముఖ్యంగా కామెడీ సినిమాలకు ఓటీటీనే బెస్ట్ ఆప్షన్. కానీ అదేంటో.. ఈ సినిమా ఓటీటీలో కూడా తేలిపోయింది.