'స్నేహా ఉల్లాల్' ఈ పేరు విని చాలా కాలమే అయ్యింది కదా. అప్పుడెప్పుడో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ ముద్దుగుమ్మ. జూనియర్ ఐశ్వర్యగా కుర్రకారును తన అందంతో గిలిగింతలు పెట్టింది. తొలి సినిమాకే సూపర్ డూపర్ హిట్ కూడా కొట్టేసింది. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ, అవన్నీ అంతంత మాత్రమే.
స్టార్ హీరో బాలయ్యతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన అవకాశం అమ్మడి కెరీర్‌లో చెప్పుకోదగ్గది. అయితే ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోందీ ముద్దుగుమ్మ. అసలు విషయానికి వస్తే, ఈ బ్యూటీ తాజాగా తన ట్విట్టర్‌లో ఓ పిక్ పోస్ట్ చేసింది. ఈ పిక్‌తోనే ఇప్పుడీ బ్యూటీ హాట్ టాపిక్ అయ్యింది. చేతిలో పళ్ల బుట్టతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
అంతే కాదు హాట్ హాట్ బికినీలో మరి. అందుకే కుర్రకారు ఊరుకుంటారా.? పండ్లు కోసిస్తే తిని పెడతామని కొంతమంది. బికినీలో చాలా హాట్‌గున్నావని ఇంకొంతమంది పొగుడుతూ, కొందరు ఆమె ధరించిన బికినీపై ఉచిత సలహాలిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకాలస్యం మీరూ ఏదో కామెంట్ పెట్టేయండి మరి.