విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌లో చాలా కోణాలున్నాయి. తను గొప్ప నటుడే కాదు, దర్శకుడు కూడా. నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టాడు. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. కలం పట్టి రచయితగా మారాడు. సినిమాలకు 'రచన' చేసిన అనుభవం ఉన్నా... ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకూ పుస్తకాలేం రాయలేదు. తొలిసారి 'దోసిట చినుకులు' అనే పుస్తకం రచించాడు ప్రకాష్. ఈరోజు హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాడు.
ప్రకాష్ రాజ్ గొప్ప సాహిత్య ప్రేమికుడు. చలం నుంచి, తిలక్ వరకూ.. దిగ్గజ రచయితలు, కవుల పుస్తకాల్ని పిండేసి, ఆ భాషా సంపదనంతా తన హృదయంలో దాచుకున్నాడు. తనది కన్నడ సీమే అయినా తెలుగుపై ప్రేమతో, మన భాష నేర్చుకుని, మన సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని, ఇప్పుడు తెలుగులో ఓ పుస్తకం రాయడం నిజంగా అభినందించదగిన విషయమే.
ఈమధ్య సామాజిక వేదికలపై, ప్రస్తుత రాజకీయాలపై, విధానాలపై గళం ఎత్తుతున్న ప్రకాష్‌రాజ్.. ఈ పుస్తకంలో ఎలాంటి విషయాలు చర్చించాడో తెలియాలంటే... ఈ రోజు సాయంత్రం వరకూ ఆగాల్సిందే.