నాగార్జున కెరీర్‌లో అతి పెద్ద విజయం సోగ్గాడే చిన్ని నాయినా తో దక్కింది. ఆ సినిమా రూ.50 కోట్ల మైలు రాయి అందుకుంది. `బంగార్రాజు`పై కూడా అన్నే అంచనాలూ, ఆశలూ ఉన్నాయి. ఈ సినిమా కూడా సంక్రాంతికే విడుదల అవుతోంది. కాబట్టి మ్యాజిక్ రిపీట్ అవుతుందని నాగ్ నమ్ముతున్నాడు. అందులో భాగంగానే.. సోగ్గాడేలో.. సెంటిమెంట్ ని బంగార్రాజులో కూడా రిపీట్ చేయబోతున్నాడని టాక్.
సోగ్గాడేలో నాగ్ ద్విపాత్రాభినయం చేశాడు కదా? తండ్రీ కొడుకులుగా నాగ్ కనిపించాడు. కొడుకు రామ్ పాత్రకు నాగచైతన్య పుట్టడంతో `బంగార్రాజు` కథ మొదలవుతుందని టాక్. అంటే.. నాగచైతన్యకు తాత, తండ్రులుగా నాగ్ కనిపిస్తాడన్నమాట. తొలి సన్నివేశంలో నాన్న పాత్ర మాయమవుతుందని, మళ్లీ క్లైమాక్స్ లోనే కనిపిస్తుందని టాక్. ఇద్దరు నాగార్జునలు, ఓ నాగచైతన్య కలిసి క్లైమాక్స్ ఫైట్ లో కనిపిస్తార్ట. అది.. అక్కినేని అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుందని సమాచారం. `బంగార్రాజు`లో అఖిల్ కూడా కనిపించనున్నాడని ఓ వార్త అప్పట్లో వినిపించింది. అయితే చిత్రబృందం మాత్రం దాన్ని కొట్టిపారేసింది. మరి ఈ డ్యూయల్ రోల్ గురించి ఏమంటారో?