బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎప్పుడూ ఓ ‘అతి ఆవేశపరుడు’ వుండేలా చూసుకుంటుంటారు నిర్వాహకులు. ఫస్ట్ సీజన్‌లో శివబాలాజీకి కోపమెక్కువ. కానీ, సీజన్ విన్నర్ అయ్యాడు. రెండో సీజన్‌లో ‘కోపిష్టి’ తనీష్ సత్తా చాటలేకపోయాడు. మూడో సీజన్‌లో అలీ రెజా పరిస్థితీ అంతే. మరి, నాలుగో సీజన్‌లో ఏమవుతుంది.? నాలుగో సీజన్ విషయానికొస్తే, అతి కోపిష్టి ఇంకెవరో కాదు సోహెల్. ప్రస్తుతం కెప్టెన్‌గా వున్నాడు సోహెల్. ఊరికే అరిచేయడం ద్వారా తన ఇమేజ్‌ని తానే చెడగొట్టుకుంటున్నాడు.
‘అమ్మాయిల మీద అరిస్తే ఊరుకునేది లేదు..’ అంటూ కింగ్ అక్కినేని నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో కొరడా ఝుళిపించినా తీరు మారడంలేదు. అక్కడికేదో తనను తాను కంట్రోల్ చేసుకుని, జనాన్ని ఉద్ధరించేసినట్లు బిల్డప్ ఇస్తున్నాడు సోహెల్. కాగా, బిగ్‌బాస్ డీల్స్ టాస్క్ సందర్భంగా కెప్టెన్ సోహెల్, సంచాలకుడిగా వున్నప్పటికీ, ‘బ్లూ బృందానికి’ సపోర్ట్ ఇస్తున్నాడు. ఆ బృంద నాయకుడు అఖిల్‌కి పూర్తి మద్దతిస్తున్నాడు సోహెల్. ఇంకో బృందానికి వ్యతిరేకంగా సోహెల్ చర్యలు కనిపించడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు.
సోహెల్ నిజంగానే పార్షియాలిటీ ప్రదర్శిస్తున్నాడా? అతని కోపంలో నిజాయితీ వుందా.? లేకపోతే, ఇదంతా ‘యాక్టింగేనా.?’ అన్న అనుమానాలు కూడా బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి కలుగుతున్నాయి. అంతిమంగా ఇదొక రియాల్టీ షో మాత్రమే. ఇందులో ఓవరాక్షన్ చేస్తే, ఆటోమేటిక్‌గా ఇమేజ్ పెరుగుతుందని కంటెస్టెంట్స్ భావిస్తే అది హాస్యాస్పదమే అవుతుంది.