బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొన్నవారిలో సోహైల్ ఒకడు. ఇప్పుడు హీరో అయిపోయాడు. తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటైన 'లక్కీ లక్ష్మణ్' రేపు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లతో సోహైల్ బిజీగా ఉన్నప్పుడు.. ఇనయా సోహైల్‌కి ప్రపోజ్ చేసి... షాక్ ఇచ్చింది. సోహైల్ - ఇనయ మధ్య సమ్ థింగ్ .. సమ్ థింగ్ నడుస్తుందనే గుసగుసలు కూడా మొదలయ్యాయి. కానీ.. సోహైల్ మాత్రం అలాంటిదేం లేదు అంటున్నాడు. ''నాపై ఇనయాకు క్రష్ ఉంది. అయితే.. నాకు ఎవరినీ ప్రేమించే టైమ్ లేదు. ఒకవేళ ఎవరికైనా లవ్ యూ చెప్పాలనుకొంటే అది అనుష్కకే. అనుష్క ఎప్పుడు కనిపించినా... నేను ఐలవ్ యూ చెబుతా... నన్ను తిట్టినా, కొట్టినా ఫర్వాలేదు. తనపై నాకు క్రష్ ఉంది'' అంటున్నాడు సోహైల్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరవాత సోహైల్ `మిస్టర్ ప్రెగ్నెంట్` అనే సినిమా పూర్తి చేశాడు. అయితే దానికంటే ముందు 'లక్కీ లక్ష్మణ్' విడుదల అవుతోంది. దీంతో పాటు మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్టయినా.. సోహైల్ బండి స్పీడు అందుకొన్నట్టే.