సోనాక్షి సిన్హాని 'దేశీ బ్యూటీ'గా అభివర్ణిస్తుంటారు చాలామంది. మోడ్రన్ కాస్ట్యూమ్స్‌లో అయినా సంప్రదాయం ఉట్టిపడేలా కన్పించడం సోనాక్షి సిన్హా ప్రత్యేకత మరి. బాలీవుడ్లో 'దబాంగ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, షాట్ గన్ శతృఘన్ సిన్హా కుమార్తె. కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు పోటెత్తుతున్నా, ఎంపిక చేసుకుని మరీ విలక్షణ చిత్రాల్ని ఎంచుకుంటున్న సోనాక్షి, అప్పుడప్పుడూ మోడ్రన్ దుస్తుల్లోనూ హాట్ అప్పీల్ పండిస్తూ హల్చల్ చేస్తుంటుంది. హాట్ అప్పీల్ అంటే అందాల ప్రదర్శన కాదనీ, అది కళ్ళల్లో వుంటుందని సోనాక్షి చెప్పేది నిజమే. కాదంటే, ఒక్కసారి ఆమె కళ్ళల్లోకి చూడండి.. హాట్ అప్పీల్ అంటే ఏంటో అర్థమవుతుంది. టూ పీస్ బికినీ వేసుకున్నా, అందులో వల్గారిటీ కన్పించకూడదన్నది సోనాక్షి సిన్హా సిద్ధాంతమట. అయితే ఆ టూ పీస్ బికినీలో గ్లామర్ చూపిస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. ఇప్పటివరకూ ఆ స్థాయి గ్లామర్‌ని సోనాక్షి పండించలేదనుకోండి. అది వేరే మేటర్.