మరీ అంత హాట్‌గానా! అసలు సోనాక్షికి ఏమైంది.?

By iQlikMovies - August 01, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ఏమంత విచ్చల విడిగా ఎక్స్‌పోజింగ్‌ చేయదన్న సంగతి తెలిసిందే. కానీ, ఈ మధ్య సోనాక్షి నోటి వెంట వస్తున్న మాటలు మాత్రం చాలా ఘాటెక్కిస్తున్నాయి. అడల్ట్‌ ముచ్చట్లు ఎక్కువగా ముచ్చటిస్తోంది సోనాక్షి సిన్హా. స్కూళ్లలో సెక్స్‌కి సంబంధించిన పాఠాలు చెప్పాలంటోంది. ఇంట్లోనూ తమ పిల్లలతో తల్లితండ్రులు ఈ విషయాలు మాట్లాడగలగాలి అంటోంది.

 

ఇదేంటీ? సోనాక్షి ఇలా మాట్లాడుతోంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు కదా. అవును అనుకుంటాం. అయితే, ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి సంచనల వ్యాఖ్యలు చేస్తోంది సోనాక్షి. సెక్స్‌ క్లినిక్‌ని నడిపే ఓ మహిళ పాత్రలో సోనాక్షి నటిస్తోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌ కోసమే, సోనాక్షి ఇంతలా (బరి తెగించి అనాలేమో) మాట్లాడుతుందనుకోవాలేమో.

 

మాటలైతే చెబుతోంది కానీ, ఆమె కూడా ఇంట్లో తన పేరెంట్స్‌తో ఇలాంటి విషయాలు మాట్లాడనే మాట్లాడదు. కానీ, ప్రమోషన్స్‌ పేరు చెప్పి, సోనాక్షి నోట ఈ తరహా మాటలంటే కాసింత ఆశ్చర్యపోతున్నారు ఆమె అభిమానులు. ఇదిలా ఉంటే, సోనాక్షి 'మిషన్‌ మంగళ్‌' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సైంటిస్ట్‌ పాత్రలో సోనాక్షి నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS