గ్లామరస్ పాత్రల్లోనూ కన్పిస్తానంటూ మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో, సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. మెగా కాంపౌండ్‌కి చెందిన నిహారిక, వెండితెరపై అందాల ప్రదర్శన చేస్తే అస్సలేమాత్రం సబబు కాదంటూ కొందరు ఆమెకే డైరెక్ట్‌గా వార్నింగ్స్ ఇచ్చేస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ట్రెండ్ మారింది గనుక.. గ్లామర్‌ని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు. తెలుగులో పలు సినిమాలు చేసిన నిహారిక, హీరోయిన్‌గా సరైన సక్సెస్ కొట్టలేకపోయింది.
తెలుగమ్మాయిలంతా తమిళ సినీ పరిశ్రమల్లో సత్తా చాటుతుండడంతో, నిహారిక కూడా తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. తెలుగు హీరోయిన్లకు సంబంధించి రచ్చ గెలిగి, ఇంట గెలవాల్సిన పరిస్థితే వస్తోంది చాలాకాలంగా. ఈ లిస్ట్‌లో వేద, స్వాతి, రీతూ వర్మ.. ఇలా చాలామందే వున్నారు. ఇదిలా వుంటే, నటన విషయంలో తన కుమార్తెకు పూర్తి స్వేచ్చ ఇచ్చానని నాగబాబు పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం విదితమే.
సినీ పరిశ్రమలో ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తనకు తన పరిమితులేమిటో బాగా తెలుసని నిహారిక అంటోంది. గ్లామర్ అంటే అదేదో బూతు.. అన్నట్లు చూడొద్దన్నది నిహారిక వాదన. కానీ, గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్.. దానికి లిమిట్స్ ఏంటి.? అనేది చెప్పలేం.