కేన్సర్‌ బాంబ్‌ పేల్చిన హాట్‌ బ్యూటీ

By iQlikMovies - July 04, 2018 - 16:31 PM IST

మరిన్ని వార్తలు

పలు సక్సెస్‌ఫుల్‌ తెలుగు, హిందీ చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్‌ సోనాలీ బింద్రే కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల కాస్త అస్వస్థత కారణంగా వైద్యుని వద్ద పరీక్షలు చేయించుకున్న సోనాలీ బింద్రేకు క్యాన్సర్‌ అని తేలింది. వైద్యుని సలహా మేరకు ఈ వ్యాధికి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స చేయించుకుంటోంది సోనాలీ బింద్రే. 

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్‌ అయ్యారు. తన ఫ్యామిలీ మెంబర్స్‌, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు వచ్చి సోనాలీ బింద్రేకి ధైర్యం చెబుతున్నారట. వారి మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్ని కల్గిస్తున్నాయట. వారి సలహాలు, సహాయ, సహకారాలతో ఈ క్యాన్సర్‌ మహమ్మారిని ఎదిరిస్తానని ఆమె చెబుతోంది. 

జీవితం అన్నాక మనం ఊహించని ఎన్నో మలుపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్య వచ్చింది కదా అని వాటిని చూసి భయపడకూడదు. పోరాడాలి. గెలిచే వరకూ పోరాడాలి అది మంచైనా, చెడైనా.. అని సోనాలి బింద్రే చెబుతున్న మాటలు ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. 

గతంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ మనీషా కోయిరాల, గౌతమి తదితరులు క్యాన్సర్‌ వ్యాధిని అధిగమించి ఇప్పుడు లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నవారే. అలాగే మన అభిమాన అందాల నటి సోనాలీ బింద్రే కూడా ఈ వ్యాధిని జయించాలని ఆశిద్దాం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS