సోనమ్ కపూర్ పెళ్ళి సందడి మొదలైంది

మరిన్ని వార్తలు

నటి సోనమ్ కపూర్ తన ప్రాణ స్నేహితుడైన ఆనంద ఆహుజాని పెళ్ళి చేసుకోనుంది అన్న సంగతి విదితమే.

అయితే శ్రీదేవి అకాలమరణంతో వీరి వివాహం వాయిదాపడింది. ఇక గత రెండు వారల నుండి వీరి వివాహం బయట దేశంలో జరిగే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు రావడం చూస్తూనే ఉన్నాము. తాజాగా వీరి వివాహం ముంబైలోనే జరగనున్నట్టుగా బాలీవుడ్ మీడియా వార్తలు వెలువరిస్తున్నది.

ఇక వీరి వివాహానికి సంబంధించి పనులు కూడా మొదలైనట్టుగా సమాచారం. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే నెలలో ఈ వివాహం జరగనుందట..  ఈ వివాహానికి యావత్ బాలీవుడ్ తరలిరానుంది. సంగీత్, వివాహంలో చేయబోయే కార్యక్రమాలకి సన్నాహకాలు కూడా ప్రారంభమయ్యాయట.

వీరి వివాహం జరిగితే, పెళ్ళయ్యాక కూడా సినిమా కెరీర్ ని కొనసాగిస్తున్న నటీమణుల జాబీతాలో సోనమ్ కపూర్ చేరిపోనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS