దాదాపు రెండు దశాబ్దాల విరామం తరువాత నాగార్జున-ఆర్జీవీ చేసిన చిత్రం ఆఫీసర్. ఇప్పటికే ఈ ఆఫీసర్ కి సంబందించిన ప్రచార కార్యక్రమాలని తన ట్విట్టర్ ద్వారా మొదలుపెట్టేశాడు వర్మ. ఇక మొన్ననే లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈ ట్రైలర్ ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం ఇందులో భాగమే...
ఇక విషయానికి వస్తే, ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం వచ్చే నెల విడుదలకానుందట. దీనికి సంబంధించి ఒక ప్రకటనని దర్శకుడు వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. విడుదల ఆలస్యం కావడానికి కారణం మాత్రం అందరు రొటీన్ గా చెప్పే టెక్నికల్ వర్క్స్ పూర్తవ్వకపోవడం అని చెప్పుకొచ్చాడు.
ఇదేనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో ఆర్జీవీ తన తదుపరి చిత్రం తెలుగు లో నాగార్జున తనయుడు అఖిల్ తో చేయబోతున్నాడు. అన్ని కలిసొస్తే ఈ చిత్రం వచ్చే నెలలో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
మొత్తానికి ఆఫీసర్ అనుకున్న టైంకి రావట్లేదు...