బాలీవుడ్లో సోనమ్ కపూర్‌కి స్టైల్ ఐకాన్‌గా పిచ్చ క్రేజ్ ఉంది. 'ప్రేమ్ రతన్ థన్పాయో' తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్గా పాపులర్ అయ్యింది. చాలా సందర్భాల్లో నెటిజన్స్ నుండి వరస్ట్ ఫ్యాషన్ అంటూ విమర్శలు అందుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఫ్యాషన్ ఐకాన్ అంటే సోనమ్‌నే అని ఠకీమని చెప్పేస్తూంటారు. తోటి హీరోయిన్స్‌కి సైతం ఫ్యాషన్ టిప్స్ ఇవ్వడంలో సోనమ్ ముందుంటుంది. డ్రస్సింగ్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ, బాలీవుడ్‌కి ఫ్యాషన్ ఐకాన్ అంటే సోనమ్ అని నిస్సందేహంగా చెప్పేయచ్చు. ఫ్యాషన్‌లో హైట్ ఆమెకి ప్లస్ పాయింట్. ఏ డ్రస్సు వేసినా ఇట్టే సెట్ అయిపోతుంది. తాజాగా ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ సింప్లీ సూపర్బ్ అనేలా ఉండడంతో పాటు, అందులో సోనమ్ కపూర్ క్రియేటివిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జస్ట్ ఫ్రాక్ అయినా కానీ దానికి ఎక్స్ట్రాగా జోడించిన ప్యాటర్న్‌లో ఆమెకు ఫ్యాషన్ పట్ల ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తోంది. అలాగే ఈ కాస్ట్యూమ్‌కి ఆమె వాడిన యాక్స్సరీస్ డ్రస్సుకి ఎక్స్ట్రా ఎట్రాక్షన్ తెచ్చిపెడుతున్నాయి.