నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాలో ప్రతినాయకుడి కోసం ముందు నుంచీ అన్వేషణ సాగుతూనే ఉంది. కానీ.. ఇప్పటి వరకూ ప్రతినాయకుడెవరన్నదీ ఖారారు కాలేదు. విలన్ కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపాలన్నది బోయపాటి ప్రయత్నం. అందుకు గానూ... సంజయ్ దత్ పేరు కూడా పరిశీలించారు. కానీ.. కుదర్లేదు. `వినయ విధేయ రామా`లో నటించిన వివేక్ ఓబెరాయ్‌ని రంగంలోకి దింపాలనుకున్నారు. కానీ.. అది కూడా వీలు కాలేదు. ఎట్టకేలకు ఈ సినిమాలో విలన్ ఫిక్సయ్యాడని టాక్.
సోనూసూద్ ని ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ఎంచుకున్నారని సమాచారం. బాలయ్య సినిమాలో సోనూ నటించడం ఇదే తొలిసారి. సోనూకి ఈమధ్య దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. సోనూలో ఓ రియల్ హీరోని చూస్తున్నారు. దాంతో... సోనూ గ్రాఫ్ కూడా పెరిగింది. అన్ని చోట్ల నుంచీ అవకాశాలు వస్తున్నాయి. అందుకే బోయపాటి కూడా సోనూ ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈనెలలోనే బాలయ్య సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.