సూపర్ స్టార్ రజినీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఈరోజు చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో హాజరయ్యారు.
అయితే ఆమె తన భర్త అశ్విన్ నుండి విడాకులు తీసుకోడానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ కోసం కోర్టుకి వచ్చినట్టు తెలుస్తుంది. వీరిద్దరి వివాహం 2010లో పెద్దల అంగీకారంతో జరిగింది, అయితే వీరిమధ్య తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా ఈ వివాహబందం నుండి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట.
ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు వీరికి ఒక ఆరు నెలల వ్యవధి ఇద్దరికీ ఇచ్చిందట, ఆ తరువాత కూడా వీరు విడిపోవాలి అని అనుకుంటే కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తుందట.
రజినీకాంత్ కుటుంబానికి ఇది ఒకరకమైన చేదు జ్ఞాపకమనే చెప్పాలి.