తరుణ్ భాస్కర్ కి లీగల్ నోటీసులు

మరిన్ని వార్తలు

టాలీవుడ్ యంగ్  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి లీగల్ నోటీసులు వెళ్లినట్టు సమాచారం. ఎందుకు ఏమిటి అనుకుంటున్నారా? లెజండరీ గాయకుడు దివంగత  ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని AI టెక్నాలజీ ద్వారా  తరుణ్ భాస్కర్ తన సినిమాలో ఉపయోగించుకున్నందుకు  బాలు కొడుకు ఎస్పీ చరణ్ ఈ పిటిషన్ ని  వేశారు.  AI టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారి వాయిస్ ని కూడా రీ క్రియేట్ చేస్తూ కొన్ని సాంగ్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. స్టార్టింగ్ లో ఫాన్స్ ఇలాంటివి చేసేవారు. కానీ ఇపుడు మ్యూజిక్ డైరెక్టర్స్,  ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మొదట ఏ ఆర్ రెహమాన్ ఉన్నారు. రెహమాన్  ఓ సినిమా కోసం AI టెక్నాలజీ ద్వారా  ఎస్పీబీ వాయిస్ ని రి క్రియేట్ చేసి వాడుకున్నారు.


ఎస్పీబీ వాయిస్‌ని రెహమాన్ ఉపయోగించుకోవటానికి వారి కుటుంబసభ్యులు పర్మిషన్ తీసుకున్నారు. కానీ తరుణ్ భాస్కర్ తన సినిమా ‘కీడా కోలా’లో బాలసుబ్రమణ్య వాయిస్‌‍ని  ఎవరి పర్మిషన్ లేకుండా AIతో ఉపయోగించుకున్నారు. ఈ మూవీలోని ఓ సీన్ లో బ్యాక్‌గ్రౌండ్ లో స్వాతిలో ముత్తమంత అనే సాంగ్‌ను కామెడీ సీక్వెన్స్‌ కోసం వాడారు. దానికోసం ఏఐ ద్వారా ఎస్సీబీ వాయిస్‌తో సాంగ్‌ రీ క్రియేట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన   చరణ్ కోర్టులో పిటిషన్ వేశారు. తరుణ్ భాస్కర్ అండ్ కీడా కోలా మూవీ టీం నుంచి క్షమాపణలు కోరుతూ 1 కోటి రూపాయిలు ఫైన్ గా చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులు పంపించడానికి ముందు తరుణ్ అండ్ మూవీ టీంని ఈ ఇష్యూ పై సంప్రదించినప్పటికీ.. వారిని నుంచి సరైన జవాబు రాలేదని, అందువల్లనే  కోర్టు ద్వారా వెళ్లినట్లు చరణ్ లాయర్ వెల్లడించారు.


ఈ విషయం పై చరణ్ స్పందిస్తూ  "మాకు దూరమైన మా తండ్రి వాయిస్‌ని ఏఐ ద్వారా రీక్రియేట్‌ చేయడం మంచి విషయమే. చనిపోయినా ఆయన గొంతుకు మళ్లీ జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ, దీనిపై కనీసం మాకు ముందస్తు సమాచారం ఏం లేదు. మా అనుమతి లేకుండా ఆయన గొంతును రీక్రియేట్‌ చేయడం మాకు బాధ కలిగించిందన్నారు. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. అందుకే ఈ విషయంలో లీగల్‌గా వెళ్లామని ఆయన పేర్కొన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS