గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త కుదట పడింది. ఈనెల 5న కరోనా బారీన పడి.. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తరవాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వెంటిలేటర్ పై నే చికిత్స అందింస్తున్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడంతో అభిమానులు కలరవ పడ్డారు.
బాలు కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేశారు. అవన్నీ ఫలించాయి. బాలు కోలుకుంటున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటీవ్ వచ్చింది. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, ఆరోగ్యం స్థిరంగా ఉందని తనయుడు ఎస్.పి. చరణ్ తెలిపారు. బాలు త్వరగానే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారన్న నమ్మకం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.