తమన్నా, సత్యదేవ్ ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నాగ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి `గుర్తుందా.. శీతాకాలం` అనే పేరు ఖరారు చేశారు. శీతాకాలంలో జరిగిన ఓ ప్రేమకథ ఇది. `చాలా ప్రేమకథలు శీతాకాలంలోనే మొదలవుతాయి.. అందులో ఇదొకటి` అని చిత్రబృందం ఈ సినిమా గురించిన హింట్ ఇచ్చింది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా ఇంకా మొదలవ్వకుండానే మంచి బజ్ ఏర్పడింది. ఆడియో రైట్స్ కూడా అమ్ముడైపోయాయి. 75 లక్షలకు ఆనంద్ ఆడియో.. ఈ సినిమా ఆడియో హక్కుల్ని కొనుగోలు చేసింది. ఇటీవల వరుసగా మంచి మంచి సినిమాలు, మంచి పాత్రలతో మెప్పిస్తున్నాడు సత్యదేవ్. `ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య`కి మంచి స్పందన వచ్చింది. తొలిసారి ఓ పూర్తి స్థాయి ప్రేమకథలో కనిపించబోతున్నాడు.