ప్రముఖ నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత మరణం వెనుక అనేక సందేహాలు ఉన్నట్టు ఆమె చనిపోయిన నాటి నుండే అనేక వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ మధ్యన జరుగుతున్న రాజకీయ ఆరోపణల నేపధ్యంలో ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేసింది. ఈ కమిషన్ కి విశ్రాంత జస్టిస్ ఆరుముఖస్వామి నేతృత్వం వహించనున్నారు అలాగే వీరి విచారణ కోసం ప్రత్యేకంగా ఒక భవంతిని కూడా కేటాయించారు.
ఇక ఈ విచారణలో అప్పటి పాలనా యంత్రాంగం నుండి మొదలుకొని ఆమెకి వైద్యం చేసిన లండన్ డాక్టర్, అపోలో వైద్యులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విచారణలో అసలు ‘అమ్మ’ ఎలా చనిపోయింది అన్న వార్తలు వెలుగులోకి రానున్నాయి అని అందరు ఆశిస్తున్నారు.
మరి.. ఈ కమిషన్ అందరి ఆశలునేరవేరుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.