తాప్సీ నటించిన 'పింక్' సినిమాని ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు రాష్ట్రపతి. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సంబంధించిన కథ ఇది. ఇందులో లైంగిక వేధింపులకు గురైన మహిళల తరఫున వాదించే లాయర్‌గా అమితాబ్ నటించాడు. హిందీలో పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. తాప్సీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా తిలకించడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ సినిమా పలు అంతర్జాతీయ సినీ వేడుకల్లోనూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే తాప్సీకి బాలీవుడ్‌లో తిరుగు లేకుండా ఉంది. ఈ అరుదైన గౌరవంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అన్పించుకోవడానికి అతి దగ్గర్లోనే ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇక ఈ మధ్యే విడుదలైన 'ఘాజీ' సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిన సినిమానే. ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా స్టోరీ పరంగా ఈ సినిమా తాప్సీకి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా తెలుగులో గ్లామర్ నటిగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తాప్సీ బాలీవుడ్‌లో ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అభినందించదగ్గ విషయమే.