అనుపమ లక్కు తిరిగిందోచ్‌

మరిన్ని వార్తలు

ఒక్క సినిమా ఆమె లక్కుని మార్చేసింది. ఆమె ఎవరో కాదు 'అఆ' ఫేం అనుపమ పరమేశ్వరన్‌. టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ బ్యూటీ తెలుగులోనే సెటిలైపోవాలనుకుంటోందట. తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకుంటున్నానంటోన్న ఈ బ్యూటీ తన తాజా చిత్రం 'శతమానంభవతి' సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. 'ప్రేమమ్‌', 'అఆ' సినిమాలో నటించినా ఈమెది మెయిన్‌ హీరోయిన్‌ రోల్‌ కాదు. 'శతమానంభవతి' సినిమా పూర్తిస్థాయిలో ఆమె హీరోయిన్‌గా నటించినదే. అందుకే ఈ సినిమా సక్సెస్‌ అయితే ఆ క్రెడిట్‌ తన ఖాతాలోనే పడుతుందని అనుపమ భావిస్తోందని సమాచారమ్‌. హీరోయిన్లు ఎలా క్లిక్‌ అవుతారో చెప్పలేం. అనూహ్యంగా అవకాశాలు దక్కుతుంటాయి. అందం, అందానికి తగ్గ అభినయం అన్నీ ఉన్న అనుపమ చుట్టూ రెమ్యునరేషన్‌ గాసిప్స్‌ కూడా మొదలయ్యాయి. దానర్థం అనుపమ డిమాండ్‌ పెరుగుతోందనే. అయితే రెమ్యునరేషన్‌ గాసిప్స్‌ విషయంలో మాత్రం అనుపమ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఇలాంటి గాసిప్స్‌ హీరోయిన్ల ఇమేజ్‌ని చెడగొడుతుంటాయి. ఏదేమైనా 'దిల్‌' రాజు ప్రొడక్షన్‌లో అనుపమ నటించిన 'శతమానంభవతి' సినిమా హీరోయిన్‌గా ఆమెకు మంచి ప్రొజెక్షన్‌ లభించింది, అది కూడా విడుదలకు ముందే. ఏ హీరోయిన్‌కి అయినా ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS