దసరా సీజన్ ని టార్గెట్ చేసి ముగ్గురు హీరోలు తమ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా ఏంటో తేల్చుకోవడానికి ముందుకి వచ్చారు.
అందులో మొట్టమొదటిగా- ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ముందు వారం విడుదలై దసరా సీజన్ ని ఒక హిట్ చిత్రంగా ప్రారంభించింది. విడుదలైన వారంలోనే రూ 100కోట్ల గ్రాసుని సొంతం చేసుకొని తన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. జై (రావణ) పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేసింది.
ఇక ఈ వరుసలో రెండవ చిత్రంగా విడుదలైన స్పైడర్ చిత్రం మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ మూటకట్టుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం తేలిపోయింది అనే చెప్పాలి. కలెక్షన్స్ మొదటిరోజు బాగానే ఉన్నా రెండవ రోజు నుండి మాత్రం చాలా తక్కువకి పడిపోవడం ఈ చిత్రాన్ని కమర్షియల్ గా బలహీనపడేలా చేసేసింది.
ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులని కూడా తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పొచ్చు. ఇక ఈ వరుస క్రమంలో చివరగా విడుదలైన సరే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకొని దూసుకుపోతున్న చిత్రం మహానుభావుడు. శర్వా-మారుతీ కలయికలో వచ్చిన ఈ చిత్రం పండగ సీజన్ లో ఎటువంటి చిత్రమైతే ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి చిత్రమే అవ్వడంతో హిట్ టాక్ సొంతం చేసుకుంది.
మొత్తానికి ఈ సీజన్ లో వచ్చిన మూడు చిత్రాలలో ఒకటి (స్పైడర్) ఫ్లాప్ అవ్వగా మరో రెండు చిత్రాలు (జై లవ కుశ & మహానుభావుడు) ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే వేసుకున్నాయి.