సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుతో సహా, నేచురల్ స్టార్ నానిపైనా ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడూ ఇలాంటి ఐటీ దాడులు సహజమే అయినప్పటికీ, తాజా దాడుల కారణంగా ఓ లేడీ తెగ పండగ చేసుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు, బూతుల భామ శ్రీరెడ్డి. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని షేర్ చేస్తోందీ సెన్సేషనల్ బూతుల భామ. గతంలో తన బూతు టాలెంట్‌ని ఉపయోగించి, నానిపై జుగుప్సాకరమైన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. తాను అలా చేయడం సబబే అనీ, దేవుడున్నాడనీ, అందుకే ఇలా చేశాడంటూ నీతులు చెబుతోంది.
ఇక సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్‌పై కూడా శ్రీరెడ్డి పలు ఆరోపణలు చేసింది. అభిరామ్‌తో తనకు శారీరక సంబంధం ఉందనీ, రకరకాల ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి, అభిరామ్‌ని రచ్చకీడ్చే ప్రయత్నం చేసింది. అది కూడా ఈ సందర్భంగా ప్రస్థావిస్తూ, నాకు చేసిన అన్యాయానికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు దేవుడు న్యాయం చేశాడంటూ వగలు పోతోంది. శ్రీరెడ్డిలాంటి వాళ్లు ఎన్ని వగలు పోయినా, ఆమె కోరుకున్నట్లు ఎవ్వరికీ నష్టం వాటిల్లదు. ఇంకోసారి ఆమె నోటీ దురద తీర్చుకోవడం తప్ప. ఇకపోతే, శ్రీరెడ్డి ఈ మధ్య చెన్నైలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఓ తెలుగు సినిమాలోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ ప్రబుద్ధురాలు శ్రీరెడ్డి.